Header Banner

చంద్రబాబు కీలక ప్రకటన! త్వరలో ఏపీకి రానున్న గూగుల్! ఆ ప్రాంతానికి మహర్దశ!

  Wed Apr 30, 2025 14:14        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే లులూ గ్రూప్ వంటి సంస్థలు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ఏపీలో కొలువు దీరనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై కీలక ప్రకటన చేశారు. అమరావతిలో వి- లాంచ్ పాడ్ 2025ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీకి గూగుల్ రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

 

అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విశాఖపట్నం నగరాన్ని ఏపీ ఆర్థిక రాజధానిగా తయారు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే టీసీఎస్, లులూ మాల్ ముందుకు వచ్చాయి. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటుకు ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో స్థలాన్ని కూడా కేటాయించారు. 21 ఎకరాలను టీసీఎస్ క్యాంపస్ కోసం కేటాయించారు. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ విశాఖపట్నానికి రానుంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

స్టార్టప్ కంపెనీల కోసం అమరావతిలో వి- లాంచ్ పాడ్ 2025‌ను చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. విశాఖకు త్వరలోనే గూగుల్ రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నానికి గూగుల్ వస్తే.. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ మారుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో 14 నెలల్లోనే హైటెక్‌ సిటీ పూర్తి చేశామన్న చంద్రబాబు.. అప్పట్లో ఐటీని ప్రోత్సహిస్తే, ఇప్పుడు క్వాంటమ్‌ టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు గవర్నమెంట్ అటెండర్ పోస్టుకు కూడా డిమాండ్ ఉండేదన్న చంద్రబాబు.. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగాలకే ఎక్కువ డిమాండ్ ఉందని వివరించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #googleinvisakhapatnam #vlaunchpad2025 #aptechhub #chandrababuvision #amaravatistartups